నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక సిరి సినిమా హాల్ సమీపంలోని నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రాంగణంలోని మరుగుదొడ్లు, ఇతర నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.