NDL: శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు సామూహిక సీమంతాల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఆరోగ్య శాఖ సమన్వయకర్త డాక్టర్ లలిత ఆధ్వర్యంలో డాక్టర్ సోహెల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి DMHO వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.