VSP: విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జెడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర బుధవారం తెలిపారు. 1 నుంచి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరుగా, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతాయని అన్నారు.