TPT: కోటపోలూరు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే నిషేధించాలని గ్రామంలోని మహిళలు కథం తొక్కారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామ నడిబొడ్డున నిరసన తెలియజేశారు. ఈ బెల్ట్ షాప్స్ మూలంగా తమ భర్తలు, పిల్లలు మద్యానికి బానిసలవ్వడంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.