E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆదివారం ఎస్. రామలక్ష్మి (73) మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం మరో 9 మంది వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడు గణేశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.