TPT: TTDలోని పలు విభాగాలలో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు సంబంధించి గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్ పై TTD ఈవో శ్యామల రావు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్ను సెప్టెంబర్ 3న ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డా. టి. రవి, డీఎఫ్వో & జీఎం పాల్గొన్నారు.