ELR: మొక్కలు నాటుదాం పచ్చదనాన్ని పెంచుదామని ఉంగుటూరు ఎంపీడీవో జీ.ఆర్ మనోజ్ అన్నారు. శనివారం ఉంగుటూరు మండలం నారాయణపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామస్తులు మొక్కలు పెంచుకోవడానికి మొక్కల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిడ్ల అలకనంద శ్రీనివాస్ పాల్గొన్నారు.