ELR: రైతన్నలకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తెలిపారు. ఈనెల 9న జరగనున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఏలూరులోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. రైతులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.