JGL: గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయని జిల్లా ఏస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 3500 పైగా గణేష్ మండపాల నుంచి విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయబడ్డాయిని వెల్లడించారు. పోలీసు శాఖతో పాటు విద్యుత్ శాఖ, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్యశాఖ సేవలని కొనియాడారు.