ELR: టి.నర్సాపురం మండలం బండివారిగూడెం పంచాయతీ సీతంపేట శివారులో పోలీసులు ఆదివారం కోడి పందేలపై స్థావరంపై దాడులు చేపట్టారు. ఈ దాడులలో నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2,500 నగదు, ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నారని ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.