చిత్తూరు కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRSకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. అందిన ఫిర్యాదులే మళ్లీ.. మళ్లీ అందుతున్నాయి. 8వ తేదీ వరకు పరిష్కారం చూపిన వినతులు 34,543. ఆడిట్ జరిగినవి 30,313. వీరిలో 22,953 మంది సంతృప్తి చెందినా 7,359 మంది అసంతృప్తితో ఉన్నారు.