E.G: తాడిపర్రులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా తణుకు, రాజమహేంద్రవరం వైద్య నిపుణులు పరీక్షలు చేస్తారన్నారు. వారం రోజులకు సరిపడే అవసరమైన మందులు రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తారన్నారని పేర్కొన్నారు.