NDL: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్య కలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఇవాళ పలువురు వీవోఏలకు అత్యాధునిక 5G సదుపాయం కలిగిన స్మార్ట్ ఫోన్లను ఆమె అందించారు. జిల్లాలోని 1,086 మంది VOAలకు నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారన్నారు.