ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆరు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 14 శాసనసభ స్థానాల సంఖ్య 20కి, రెండు పార్లమెంటు స్థానాల సంఖ్య మూడుకు చేరనుంది. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ఈ ప్రక్రియతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది.