గుంటూరు పట్టాభిపురం పోలీసులు రాత్రి గస్తీలో ఓ మోసగాడిని పట్టుకున్నారు. పల్నాడుకు చెందిన శరత్బాబుపై ఏపీ, తెలంగాణల్లో 35 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతడు వ్యాపారుల వద్దకు వెళ్లి ఫేక్ పేమెంట్ యాప్ ద్వారా డబ్బు బదిలీ చేసినట్లు నమ్మిస్తాడు. అనంతరం వారి నుంచి నగదు తీసుకుని ఉడాయిస్తాడని పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.