TPT: ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ బుధవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.