ASR: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నిరక్షరాస్యులకు అధికారులు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. రాజవొమ్మంగి మండలంలోని 16 సచివాలయల పరిధిలో 8294 మంది లెర్నర్లుగా నమోదు కాగా, వారికి 848 వలంటీర్లు శిక్షణ ఇచ్చి ఆదివారం దానిపై పరీక్ష నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి సూరయ్య రెడ్డి ఈ పరీక్షలను పర్యవేక్షించారు.