CTR: జీడీనెల్లూరు మండలంలో కొంతకాలంగా పొట్టేళ్లు మాయమవుతున్నాయి. నెల్లేపల్లి పరిసర ప్రాంతాల్లో గొర్రెల పెంపకందారులు అధికంగా ఉన్నారు. ఇటీవల పొట్టేళ్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో నిందితులను గుర్తించేందుకు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాలను అరికట్టాలని గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు.