BPT: నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం జిల్లాలోని 82 కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పారదర్శకత కోసం సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.