ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి, సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.