VSP: వేపగుంట రామాలయంలో సీతారాముల కల్యాణం సందర్భంగా బుధవారం ఉదయం పందిరి రాట వేడుకలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ కోరింది. ఈనెల 27న ఉదయం ఆలయం ముందు కల్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు కమిటీ సభ్యులు తెలిపారు.