కృష్ణా: గుడ్లవల్లేరులో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, ఎంపీడీవో ఇమ్రాన్ పాల్గొని గ్రామంలో శుభ్రత చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మండలాన్ని వ్యర్ధరహిత మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో శుభ్రత పై ప్రత్యేక దృష్టి సాధించాలని ఎంపీడీవో సూచించారు.