NTR: విజయవాడలో దేవాదాయ శాఖ ఏసీ కె.శాంతిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో ఐదు రోజులపాటు విచారణకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏసీబీ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.