BPT: బల్లికురవ మండలం వి.కొప్పెరపాడు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షల్లో మరోసారి ప్రతిభ చాటుకున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఏకంగా 13 మంది విద్యార్థులు అర్హత సాధించి కొత్త రికార్డు సృష్టించారు. గత ఐదేళ్లుగా ఈ పాఠశాల విద్యార్థులు వరుస విజయాలు సాధిస్తున్నారు.