NLR: టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగి మంటలలో వేయొద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న సంక్రాంతి పండగల్లో భాగంగా భోగి మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కేన్సర్, టీబీ, చర్మ, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయబద్ధంగా పండగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.