VSP: సదరన్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష్మీ పూజ, దీపావళి సంబరాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసిన లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాలలో వెలుగుల నింపాలన్నారు.