AKP: నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో కే.ఉషశ్రీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వేలు, మిస్సింగ్ సిటిజన్స్, ప్యాక్ సర్వే, హౌస్ హోల్డ్ సర్వేలు, చిల్డ్రన్ విత్ ఆధార్ నాన్ రెసిడెన్స్ యాప్ సర్వేలను వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.