అనంతపురం మార్కెట్ యార్డులో ఈనాం విధానం అమలు కాకుండానే సరుకు లోడింగ్ చేయడంపై చైర్పర్సన్ బల్లా పల్లవి అధికారులను ప్రశ్నించారు. ఆన్లైన్ వ్యవస్థ ప్రారంభం కాకముందే, సరుకు ధర నిర్ణయించకుండా లోడింగ్ ఎలా చేస్తారని నిలదీశారు. రైతులకు ధర విషయంలో స్పష్టత ఉండాలని, పారదర్శకత లేని విధానాల వల్ల సాగుదారులు నష్టపోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.