విశాఖ వాల్తేరు రైల్వే డివిజన్ దివ్యాంగుల ప్రయాణ సౌలభ్యం కోసం శనివారం ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ వంటి ప్రధాన స్టేషన్లలో ‘దివ్యాంగ సహాయకుల’తో సహాయక బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ బూత్‌ల ద్వారా వీల్చైర్లు, చేతి కర్రలు వంటి సహాయక పరికరాలను ఉచితంగా అందించనుంది.