W.G: ఎల్బీ చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మాధురి గర్భిణులకు రక్త పరీక్షలు, రక్తపోటు, బరువు తదితర పరీక్షలు చేసి అవసరమైన వైద్య సలహాలు అందించారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ప్రసవం వరకు క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.