GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్దిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును మంగళవారం ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నా తమకు అన్యాయమే జరిగిందని వారు వాపోయారు. ఈ నెల 27న ఆయేషా అవశేషాలను తిరిగి ఖననం చేస్తామని, ఆ క్షణమే సత్యానికి అంతిమ సంస్కారం జరుగుతుందని వారు ప్రకటించారు.