CTR: నారాయణవనం మండలంలో జరిగిన దుర్ఘటన స్థానికులను కలిచివేసింది. నగరి మండలం గుండ్రాజుకుప్పానికి చెందిన గుణశేఖర్(42) తిరువట్యంలో జరిగిన బంధువు దహనక్రియల నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా కాజ్వే వద్ద అంకమ్మ(72) నీటిలో పడిపోవడాన్ని గమనించారు. ఆమెను రక్షించేందుకు నదిలోకి దిగిన గుణశేఖర్‌కు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.