కృష్ణా: మేదరపాలెం ముస్తాబాద పంచాయతీ పరిధిలో సూరాయి చెరువు క్రింద ఉన్న డొంక దారి అక్రమంగా మూసివేయబడటంతో, రైతులు తమ పొలాల నుంచి ధాన్యం బయటకు తీసుకురావడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ప్రజా దర్బార్‌లో రైతులు ఎమ్మెల్యే వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇవాళ స్పందించి అధికారులతో మాట్లాడి సర్వేయర్‌తో సర్వే నిర్వహించేందుకు ఆదేశించారు.