KRNL: మద్దికేర మండల ప్రజలకు శనివారం ఎస్సై హరిత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. జిల్లా పరిసరాల్లో ఇళ్ల దొంగతనాలు, వాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్లో చైన్ దొంగతనం జరిగినట్లు పేర్కొని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేయాలని సూచించారు.