E.G: రాజమండ్రిలోని పాత సోమాలమ్మ అమ్మ వారి ఆలయం పక్క స్థలంలో సారా విక్రయాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. ఎక్సైజ్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి సదరు ప్రాంతానికి గురువారం పంపించారు. ఆ ప్రాంతానికి ఎక్సైజ్ సీఐ తమ సిబ్బందితో దాడి చేయగా సారా విక్రయించే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.