చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గురువారం నగరంలో పలు ఆలయాల్లో జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరింపేటలోని శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని ఉదయం దర్శించుకున్నారు. శ్రీ దక్షిణామూర్తి ఆలయ 21వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రముఖ ప్రవచన కర్త రాధా మనోహర్ దాస్‌ను స్థానిక ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.