CTR: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీసు సిబ్బంది, హోమ్ గార్డ్స్, పదవీ విరమణ చేసిన సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని మంగళవారం ఎస్పీ తుషార్ డూడీ ప్రారంభించారు. పోలీస్ విధి ఎంతో ఒత్తిళ్లతో కూడుకుని ఉంటుందని, కావున ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స పొందాలని తెలిపారు.