NDL: ఆళ్లగడ్డ(మం) గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు వెంటనే బదిలి చేసుకోని వెళ్లి పోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంభందించిన వివిధ శాఖల అధికారులు, నాయకులతో సమస్యలపై సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయా గ్రామ నాయకులతో సమన్వయంగా వెంటనే తీర్చాలన్నారు.