ఏలూరు: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మహనీయులని నారాయణపురం గ్రామ సర్పంచ్ దిడ్ల అలకనంద అన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం హైస్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్ అలకనంద పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం పోతురాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.