ASR: డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీలో ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీఎన్టీయూసీ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, వంతల నాగేశ్వరరావు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.