ATP: పుట్లూరు మండలంలో అరటి పంట రైతులను ఆదుకోవాలని పుట్లూరు బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రామంజి యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. పుట్లూరు మండలంతో పాటు జిల్లాలో చాలా చోట్ల రైతులు ఎక్కువగా అరటి సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు. అరటి పంటకు ధర లేక రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు.