TPT: పదో తరగతి విద్యార్థులు భయపడకుండా పరీక్షలకు సిద్ధం కావాలని తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కే.వీ.ఎన్. కుమార్ సూచించారు. బుధవారం రాత్రి వడమాలపేట మండలం యనమలపాలెం గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఇళ్లను సందర్శించారు. విద్యార్థులను వారి ఇళ్ల వద్దే కలుసుకుని సబ్జెక్టులపై అవగాహనను తెలుసుకున్నారు. వివిధ విషయాలపై ప్రశ్నలు అడిగి వారికి సూచనలు చేశారు.