E.G: దేవరపల్లి జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి రాజమండ్రి మార్కెట్‌కు ఉల్లిపాయ లోడుతో వెళ్తున్న లారీ గ్రానైట్ లోడుతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.