ELR: ఆశ్రమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా హెల్మెట్ ధారణపై ప్రత్యేక అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హాజరయ్యారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనం నడుపుతూ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.