ప్రకాశం: కనిగిరిలో రోడ్లకు ఇరువైపులా తోపుడు బండ్లు, కూరగాయల వ్యాపారుల వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు శుక్రవారం వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్లకు ఆక్రమించుకుని ఉన్న తోపుడు బండ్లు, కూరగాయలను అక్కడి నుంచి తొలగించారు. మరొకసారి రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు చేపడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.