KMM: మధిర పట్టణంలో శుక్రవారం దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారి పృథ్విరాజ్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు CPR, మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలితే CPR చేసి ప్రాణాలు కాపాడవచ్చని వైద్యాధికారి అన్నారు. అలాగే మత్తు పదార్థాల బారిన పడితే జీవితం నాశనం అవుతుందని అవగాహన కల్పించారు.