కోనసీమ: రాయవరం మండలం కొమరిపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు సంఘటనపై శుక్రవారం ఉన్నతస్థాయి విచారణ జరిగింది. ఉన్నతాధికారులు సురేశ్ కుమార్, రమేశ్ కుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా కూడా వారితో కలిసి విచారణలో పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు.