KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరీక్షా విభాగాన్ని ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఏ యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. యూనివర్సిటీలో పరీక్షా నిర్వహణ విఫలం చెందిందని అనేక మార్లు పేపర్లు లీకైనా, పరీక్షా విభాగం అధికారిపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.