NLG: సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై బూటు విసిరి దాడికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. చిట్యాల MRO కార్యాలయం ముందు MRPS నాయకులు శుక్రవారం నిరసన తెలిపి వినతిని అందించారు. మండల అధ్యక్షుడు మేడి కృష్ణ, నేతలు కావలి కృష్ణ, నోముల పురుషోత్తం తదితరలు పాల్గొన్నారు.