ASR: పాడేరు సబ్ కలెక్టర్ ఇంఛార్జ్‌గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు ఇవాళ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ ఇటీవల బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఇంఛార్జ్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఎస్డీసీ లోకేశ్వరరావును నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.